ముంబైకి ఏమైంది? హార్దిక్ మౌనం వెనుక అర్థమిదే: అశ్విన్ సెన్సేషనల్ అనాలిసిస్!

  • జట్టు ప్రణాళికల్లో ఉన్న లోపాలే హార్దిక్ మౌనానికి కారణమన్న అశ్విన్
  • టీ20 షెడ్యూల్ ప్రభావం ప్లేయర్లపై పడిందని వ్యాఖ్య
  • సుదీర్ఘ లీగ్ ఒత్తిడిని ముంబై ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారన్న అశ్విన్

ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం అంతుచిక్కని సంక్షోభంలో కూరుకుపోయింది. స్టార్ ఆటగాళ్లకు కొదవలేకపోయినా, మైదానంలో ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. పంజాబ్‌పై ఓటమి తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ... "ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు" అంటూ నిస్సహాయత వ్యక్తం చేయడంపై మాజీ క్రికెటర్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. హార్దిక్ వద్ద సమాధానాలు లేకపోవడానికి కారణం.. జట్టు ప్రణాళికల్లో ఉన్న లోపాలేనని అశ్విన్ విశ్లేషించాడు. ఈ రోజుల్లో 190 పరుగుల లక్ష్యం ఏమాత్రం సరిపోదని, ముంబయి కనీసం 20 పరుగులు తక్కువ చేసిందని అభిప్రాయపడ్డాడు.


బౌలింగ్ విభాగంలో ముంబై ఎదుర్కొంటున్న వైఫల్యాలను అశ్విన్ ఎండగట్టాడు. "బుమ్రా వంటి అగ్రశ్రేణి బౌలర్‌కు వికెట్ దక్కకపోవడం, దీపక్ చాహర్ తన తొలి ఓవర్‌లోనే 21 పరుగులు సమర్పించడం జట్టును దెబ్బతీశాయి. ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకూర్ వంటి అనుభవజ్ఞులు కూడా పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు" అని పేర్కొన్నాడు. ముఖ్యంగా టీ20 షెడ్యూల్ ప్రభావం ప్లేయర్ల ప్రదర్శనపై పడిందని, సుదీర్ఘమైన లీగ్ ఒత్తిడిని ముంబై ఆటగాళ్లు తట్టుకోలేకపోతున్నారని అశ్విన్ విశ్లేషించాడు. కేవలం బౌలింగ్‌లో అద్భుతాలు చేస్తే తప్ప ముంబై ఈ గండం నుంచి గట్టెక్కడం కష్టమని ఆయన తేల్చిచెప్పాడు.


Ravichandran Ashwin
Team India
Mumbai Indians
Hardik Pandya

More Telugu News